ఆ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ | Sakshi
Sakshi News home page

ఆ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌

Published Tue, Jan 30 2018 4:08 PM

 Railways sends employees for first foreign pleasure trip  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే ఉద్యోగులకు భారతీయ రైల్వేలు సరికొత్త అనుభూతిని అందించనున్నాయి. సీనియర్‌ అధికారులు మినహా గ్యాంగ్‌మెన్‌లు, ట్రక్‌మెన్‌ సహా ఇతర ఎన్‌జీవో ఉద్యోగులకు విదేశాలను చుట్టివచ్చే ప్లెజర్‌ ట్రిప్‌ను ఆఫర్ చేస్తున్నట్టు సంస్థ పేర్కొంది.  100 మంది సిబ్బందితో ఈనెల28న సింగపూర్‌, మలేషియాలకు తొలి బ్యాచ్‌ విమానంలో తరలివెళ్లింది.

విదేశీ పర్యటనకు ప్రయాణ ఖర్చులో 25 శాతం ఖర్చును ఉద్యోగులు భరించాల్సి ఉండగా, 75 శాతం  సిబ్బంది ప్రయోజనాల నిధి (ఎస్‌బీఎఫ్)నుంచి వాడుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే ఎస్‌సీఆర్‌ చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ ఉమాశంకర్‌ కుమార్‌ పేర్కొన్నారు. దిగువశ్రేణి క్యాడర్‌లు, రిటైర్‌మెంట్‌కు దగ్గరగా ఉన్న సిబ్బందికే విదేశీ పర్యటనల అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు.

సంస్థలోని నాన్‌ గెజిటెడ్‌ సిబ్బందికి దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్‌ ఓవర్సీస్‌ క్యాంప్‌ను నిర్వహించడం ఇదే తొలిసారని తెలిపారు. రైల్వే సిబ్బంది తమ విదేశీ ప్రయాణంలో భాగంగా యూనివర్సల్‌ స్టూడియోస్‌, సింగపూర్‌లో సెంటోస, నైట్‌సఫారి, కౌలాలంపూర్‌ నగర టూర్‌, మలేషియాలో పెట్రోనాస్‌ టవర్స్‌, బటూ కేవ్స్‌, జెంటింగ్‌ హైల్యాండ్స్‌ను సందర్శిస్తుంది. 

Advertisement
Advertisement